బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్‌. రామచంద్రరావు

అన్ని గ్రూపులకు ఆమోదయోగ్య నాయకుడు

ఆర్‌ఎస్‌ఎస్‌తో విడదీయరాని అనుబంధం

తొలినాటినుంచి నిబద్ధ పార్టీ కార్యకర్త

రాబోయే మూడేళ్లు రాజకీయంగా శాంతియుత కాలం

ఎన్నికల ముందు మళ్లీ బండి సంజయ్‌కే ఛాన్స్‌?

ఈటెల, అరవింద్‌ను పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కొన్ని నెలలుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్‌ తొలగింది. మొదట్నుంచీ పార్టీలో నిబద్ధ కార్యకర్తగా పనిచేసిన ఎన్‌. రామచంద్రరావు నూతన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఇప్పటివరకు కేంద్ర బగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీకి సారథ్యం వహిస్తున్నారు. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించిన తర్వాత 2023 జూలై నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. కాగా ఎన్‌. రామచంద్రరావుకు మొదట్నుంచీ ఆర్‌.ఎస్‌.ఎస్‌.తో మంచి అనుబంధం వుంది. ఆయన సంఫ్‌ు కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఆయనకు రాష్ట్ర ఆర్‌.ఎస్‌.ఎస్‌. నుంచి సంపూర్ణ మద్దతు లభించడం కూడా ఒక కారణం. రాబోయే మూడేళ్ల కాలం ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. తర్వాత వచ్చే ఎన్నికల ముందు బండిసంజయ్‌కి పార్టీ పగ్గాలను తిరిగి అప్పగించే అవకాశాలున్నాయి. బండిసంజ య్‌ను పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించినప్పటికీ, కేంద్ర నాయకత్వం, ఆయన మాటకు అత్యంత విలువనిస్తుంది. బీజేపీని నాటి అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమన్న స్థాయికి తీసుకెళ్లిన ఆయన సేవలను పార్టీ అధిష్టానం ఇప్పటికీ గుర్తిస్తోంది.
గతనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, కేంద్ర నాయకత్వం రామచంద్రరావును నామినేషన్‌ దాఖలు చేయాలని కోరడం విశేషం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి విషయంలో కేంద్ర నాయకత్వం ఒక స్పష్టమైన వైఖరి తో వున్నదని దీంతో స్పష్టమైంది. అయితే మల్కాజ్‌గిరి ఎం.పి. ఈటెల రాజేందర్‌, నిజామాబాద్‌ ఎం.పి. అరవింద్‌కుమార్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మహబూబ్‌నగర్‌ ఎం.పి. డి.కె. అరుణ కూడా ఈ పదవికి పోటీదార్లుగా వున్నారు. అయితే రాజాసింగ్‌ ఒక వీడియోను విడుదల చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగాలని కోరారు. కానీ అధిష్టాం దీన్ని పట్టించుకోలేదు. కేంద్ర ఎంఎస్‌ఎంఈ సహాయ మంత్రి శోభ కరండల్‌జీ కేంద్ర ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కాగా రామచంద్రరావు ఒక్కరే నామినేషన్‌ ఫైల్‌ చేసిన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
తెలంగాణ ఆర్‌.ఎస్‌.ఎస్‌. విభాగం, రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం రామచంద్రరావు పేరును సిఫారసు చేయడం ఈ ఎన్నికకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆయనకున్న విడదీ యరాని అనుబంధం, ఎబీవీపీలో రాజకీయ పాఠాలు నేర్చుకోవడం, మొదట్నుంచీ బీజేపీకి విధేయంగా వుండటం, పార్టీలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్య నాయకుడు కావడం ఆయనకు కలిసొచ్చిన అంశాలు. పార్టీ మిగిలిన వారిని పరిశీలించినప్పటికీ, ఒక్కక్కరికీ ఒక్కో రకమైన ప్రతి కూలత వుండటాన్ని కూడా పార్టీ నాయకత్వం గుర్తించింది. వీరిలో ఎవరికి అవకాశమిచ్చినా ఇతర వర్గాలనుంచి అసమ్మతి చెలరేగే ప్రమాదమున్న సంగతిని అర్థం చేసుకునే చివరకు రామచం ద్రరావువైపు మొగ్గు చూపింది. ఉదాహరణకు ఈటెల రాజేందర్‌ను, ఇటు బండిసంజయ్‌ వర్గం, కిషన్‌ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఇక బండిసంజయ్‌ అభ్యర్థిత్వాన్ని ఈటెల, కిషన్‌రెడ్డి అడ్డుకుంటారు. నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ కుమార్‌ను పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. అమిత్‌ షాతో అత్యంత సాన్నిహిత్యం వున్న నేపథ్యంలో బండి సంజయ్‌ మాటకు విలువ ఎక్కువ. ఆయన రామచంద్రరావుకు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. అరవింద్‌ కుమార్‌కు కూడా రా మచంద్రరావు అభ్యర్థిత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇక ఈటెల రాజేందర్‌ విషయానికి వ స్తే ఇప్పటికీ ఆయనకు బీఆర్‌ఎస్‌ నాయకులతో సాన్నిహిత్యం వుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఆయన్ను కూడా ప్రశ్నించడం మరో కారణం. ఆయనకు ఎన్ని అవ కాశాలిచ్చినా బీఆర్‌ఎస్‌ పట్ల సానుభూతి వున్న నేతగానే పేరుపడ్డారు. కె.సి.ఆర్‌. ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత కె.సి.ఆర్‌.తో వచ్చిన విభేదాల కారణంగా పార్టీనుంచి బయటకు వచ్చారు. అదీకాకుండా తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి నిజామాబాద్‌ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అవినీతి పార్టీ అని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అంగీకరించేవారు చేతులెత్తమని కోరగా, పాల్గన్నవారిలో చాలామంది చేతులెత్తారు. కానీ ఈటెల రాజేందర్‌ మిన్నకుండిపోయారు. దీన్ని అధినాయకత్వం గుర్తింలేదనుకుంటే పొరపాటే. పార్టీ నాయకత్వం వివిధ నేతల వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ఈ అంశం కూడా రాష్ట్ర నాయకులు అమిత్‌ షా చెవిన వేయకుండా వుండరు. ఇవన్నీ ఈటెల రాజేందర్‌ ఎ న్నికకు ప్రతికూలంగా మారాయి.
ఇక ఎన్‌. రామచంద్రరావు (66) ప్రస్తుతం అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. 2015 నుంచి 2021 వరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గం నుంచి ఎం.ఎల్‌.సి.గా తెలంగాణ శాసనమండలిలో కొనసాగారు. అంతేకాదు రాష్ట్రంలో బీజేపీ మెంబర్‌షిప్‌ డ్రైవ్‌కు ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 1985లో రామచంద్రరావు అడ్వకేట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2014లో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్‌ ఎన్‌వీఆర్‌ఎల్‌ఎన్‌ రావు, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ ఫ్యాకల్టీ డీన్‌గా పనిచేశారు. రామచంద్రరావు కుమార్తె ఆముక్త నారపరాజు ఆస్ట్రేలియాలో ఐ.టి. రంగంలో పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అవినాష్‌ నారపరాజు తెలంగాణ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో పికెట్‌ కేంద్రీయ విద్యాయంలో చదువుతున్న కాలంలో రామచంద్రరావు రాజకీయాల్లోకి ప్రవేశించారు. రైల్వే డిగ్రీ కళాశాలలో చదువుతున్న కాలం లో ఆయన ఏబీవీపీ రాష్ట్ర యూనియన్‌కు మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా వరుసగా ఎన్నికయ్యారు. ఉస్మానియా లా కాలేజీ యూనియన్‌కు ఎబివిపి తరపున అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాను చదువుకుంటున్న కాలంలో 14సార్లు జైలుకెళ్లారు. 1982లో ఆర్డ్స్‌ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీనుంచి మాస్టర్స్‌ డిగ్రీని సంపాదించారు. 1985లో బ్యాచులర్‌ ఆఫ్‌ లా డిగ్రీని ఇదే యూనివర్సిటీనుంచి పొందారు.తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, తనపట్ల అచంచల వి శ్వాసం వ్యక్తం చేసిన తె లంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్పూర్తిదాయక రాష్ట్ర ప్రజలకు సేవచేసే గురుతర బాధ్యతను అప్పగించిన నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జె.పి. నడ్డాలకు కృతజ్ఞత లు తెలిపారు. ఇదే సమయంలో తనకు రాష్ట్ర పార్టీ నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
రామచంద్రరావు ఎన్నికపై పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తం కావడం మామూలే. మరెవరు ఎన్ని కౖౖెనా ప్రతికూల గ్రూపుల నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం సహజమే. అయితే ఏ గ్రూపునకు చెందనివాడు కావడంతో అందరి ఆమోదాన్ని రామచంద్రరావు పొందగలిగారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రామచంద్రరావుకు జూబిలీ హిల్స్‌ ఉప ఎన్నిక రూపంలో సవా లు ఎదురుకానుంది. అంతేకాదు పార్టీలోని వివిధ గ్రూపుల మధ్య కూడా సమన్వయం సాధించడం ఆయన ముందున్న మరో సవాలు. కాకపోతు మృదుస్వభావి, అందరినీ కలుపుకుపోయే స్వభావం వున్న నాయకుడిగా రామచంద్రరావుకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. అంతేకాదు అందరినీ పార్టీ ఉమ్మడి లక్ష్యాలవైపు నడిచేలా చేయడానికి కూడా ఆయన పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాకపోవచ్చు. పార్టీ కేంద్ర మరియు రాష్ట్ర నాయకత్వాలతో సన్నిహిత సంబంధాలు, మొద ట్నుంచీ పార్టీకి విశ్వసనీయ కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఆయనకు సానుకూలంగా మారనున్నది. అయితే రామచంద్రరావు ఎన్నికకు ముందే పార్టీ ‘ఎం`3’ ఫార్ములాను ముందుకు తెచ్చింది. ‘ముదిరాజ్‌, మున్నూరు కాపు, మాదిగ’ వర్గాలను ఆకర్షించేందుకు పార్టీ రూపొందించిన ఫార్ములా ఇది. దీన్ని రామచంద్రరావు గట్టిగా అమలు చేసి ఆయా వర్గాలు పార్టీవైపు మళ్లేలా చేయాల్సి వుంటుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, మాదిగ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగను తన పక్కనే కూర్చోబెట్టుకోవడమే కాదు, ఎస్సీ ఉపకుల వర్గీకరణకు కూడా సానుకూలంగా స్పందించారు. సుప్రీంకోర్టు కూడా అనుకూల తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలో దీన్ని అమలు చే శారు. ఇదే మాదిరి మిగిలిన రెండువర్గాలను పార్టీకి అనుకూలంగా మారేలా రామచంద్రరావు కృషి చేయాల్సి వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!