గురుకుల పాఠశాలలను ప్రపంచానికి చాటాలన్నదే నా కోరిక

గుగులోతు దీపిక

⏩68వ యస్ జీ ఎఫ్ ఐ జాతీయస్థాయి జూడో పోటీలు.

⏩కాంస్య పతకం సాధించిన తెలంగాణ క్రీడాకారిని

⏩ కోచ్ ని అభినందించిన
హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డా.వాసంతి

⏩తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలను ప్రపంచానికి చాటాలి.

⏩ జూడో క్రీడాకారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

⏩కోచ్ నాగరాజు చొరవతో జాతీయ స్థాయిలో పథకం.

కాశిబుగ్గ నేటిధాత్రి.

గుజరాత్ రాష్ట్రంలోని మైసనా ప్రాంతంలో జరిగిన 68వ పాఠశాల (యస్ జీ ఎఫ్ ఐ) జాతీయ స్థాయి అండర్ 14సం..ల బాలబాలికల జూడో ఛాంపియన్ షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మడికొండలో 8వ తరగతి చదువుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన క్రీడాకారిని 23 కిలోల విభాగంలో జాతీయ స్థాయి పోటీలలో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలుపొంది,రాజస్థాన్ క్రీడాకారిణితో ఐదోవ మ్యాచ్ లో ఓటమిపాలై,కాంస్య పతాకం కోసం హర్యానా క్రీడాకారిణితో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో గెలుపొంది తెలంగాణ రాష్ట్రానికి గుగులోతు దీపిక 23కిలోల విభాగంలో కాంస్య పతకం (బ్రోన్జ్ మెడల్) సాధించడం జరిగింది.పథకం సాధించిన క్రీడాకారిని మరియు కోచ్ నాయకపు నాగరాజు లను హనుమకొండ జిల్లా విద్యశాఖ అధికారి డా.. వాసంతి, ఫోన్ చేసి అభినందించారు. భారత జూడో సమైక్య కోశాధికారి బైరబోయిన కైలాష్ యాదవ్,హన్మకొండ జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి దస్రు నాయక్,హన్మకొండ జిల్లా వ్యాయమ ఉపాధ్యా సంఘం అధ్యక్షులు ఏ. ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మడికొండ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, పీడీ జి.పద్మా, పి ఈ టీ సరిత మరియు తెలంగాణ జూడో సంఘం సభ్యులు దుపాకి సంతోష్ కుమార్, కోచ్ లు, జూడో సీనియర్ క్రీడాకారులు, క్రీడా అభిమానులు ఫోన్ ద్వారా క్రీడాకారులకు మరియు కోచ్ నాయకపు నాగరాజు కు అభినందనలు ఆశీస్సులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!