20 లక్షలతో నిర్మించిన నూతన జిపి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.
చిట్యాల,నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోనిఉన్న అన్ని గ్రామాల అభివృద్దే నా ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.మంగళవారం రోజున చిట్యాల మండలంలోని కాల్వపల్లి* గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో జీపీ బిల్డింగ్ కు సుమారు రూ.20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన జీపీ భవనాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని అన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల సర్పంచ్ లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద వీరారెడ్డి ఎంపీడీవో రామయ్య మండల కాంగ్రెస్ నాయకులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.