
ముత్తారం :- నేటి ధాత్రి
ఎఐసిసి ఆధ్వర్యంలో జరుగుతున్న తుక్కగూడలో జరుగుతున్న జన జాతర సభకు ఐటి శాఖా మాత్యులు’జాతీయ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని ముత్తారం మండలం నుండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో భారీగా జన జాతర సభకు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకులు,యువజన నాయకులు ‘వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు,పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు తరలి వెళ్లారు ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాట్లాడుతూ దాదాపు మండలం నుండి 200మంది నాయకులు తరలి వెళ్లడం జరుగుతుందన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కాయం అని అన్నారు