
Earthworm Fertilizer.
— వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి
• వానపాము ఎరువుల ద్వారా దిగుబడి అధికం
• సైంటిస్ట్ చిన్నబాబు నాయక్
నిజాంపేట: నేటి ధాత్రి
వర్షాకాలం వరి సాగు పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ చిన్న బాబు నాయక్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. వర్షాకాలంలో పంటలపై వచ్చే రోగాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పురుగులు నారిమడి పోసినప్పుటి నుండి వరి ఆకులపై గుడ్లను పెట్టి వాటి ఉత్పత్తిని పెంచుకుంటుందన్నారు. వాటి నివారణకు మందులను వాడాలని సూచించారు. వానపాము ఎరువుల ద్వారా వరి పంట అధిక దిగుబడిని ఇస్తుందన్నారు. ఎరువులపై కూడా రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే ఆధునిక పరిజ్ఞానం పరిధిలోని కూలీ, సమయం తగ్గించే విధంగా డ్రోన్ సహాయంతో మందును పిచ్కారి చేయవచ్చన్నారు. డ్రోన్ మిషన్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీలత, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రైతులు ఊడెడు రాజయ్య, కూడవెల్లి చంద్రం, ఊడెపు శ్రీశైలం, కోమ్మిడి రాజు, బురాని మల్లేశం, మంగలి అమర్, మ్యాదరి కనకరాజు, సౌడ స్వామి, పాతూరి రాంరెడ్డి, రాకేష్, వేణు తదితరులు ఉన్నారు.