BJP Candidate Giri Prasad Campaigns in Parakala
మున్సిపల్ ఎన్నికల ప్రచారం-బీజేపీ అభ్యర్థి గిరి ప్రసాద్
పరకాల,నేటిధాత్రి:
పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 21వ వార్డు అభ్యర్థి బండారి గిరి ప్రసాద్ కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రతి ఇంటికీ నీరు,మురుగు కాలువల నిర్వహణకు శాశ్వత పరిష్కారం,మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ ఎన్నికలలో బీజేపీ పార్టీకి భారీ మెజారిటీతో విజయం అందించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా వారు ఇంటింటా తిరుగుతూ ప్రజలతో ఓటును అభ్యర్థించారు.వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.
