
జమ్మికుంట: నేటి ధాత్రి
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ ఏర్పాటులను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల చుట్టూ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు బతకమ్మలను ఆడుకోవడానికి వీలుగా ఉండేందుకు కళాశాల మైదానంను పారిశుద్ధ కార్మికుల చేత శుభ్రం చేయించారు. జమ్మికుంట పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ పండుగను నిర్వహించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ తో పాటు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేస్తున్నారు. బతుకమ్మలను నిమర్జనం చేసేందుకు నాయిని చెరువు వద్ద ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం, మోత్కులగూడెం, రామన్నపల్లి ,ధర్మారం తోపాటు అన్ని వార్డులలో మహిళలు బతుకమ్మలను ఆడుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పాలకవర్గం హయాములో సద్దుల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు అన్ని శాఖల అధికారులు సహకరిస్తున్నారని, మహిళలందరూ కుటుంబ సమేతంగా వచ్చి సద్దుల బతుకమ్మ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంల ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి తోపాటు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.