# తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై విభాగం రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం మొగిలి ముదిరాజ్ ను ఇటీవల కెసిఆర్ ప్రభుత్వం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముదిరాజ్ కులం అధ్వర్యంలో చేపడుతున్న ముదిరాజ్ ఆత్మీయ అభినందన సభను నియోజకవర్గంలోని ముదిరాజ్ కుల భాందవులు విజయవంతం చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై విభాగం రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.బుదవారం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి సెంటర్ లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ దుగ్గొండి మండల ప్రధానకార్యదర్శి పల్లె రమేష్ అధ్యక్షతన ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముదిరాజ్ కులభాందవుడైన పొన్నం మొగిలి ముదిరాజ్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించినందుకు గాను ముదిరాజ్ కుల భాందవుల ఆత్మీయ అభినందన సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ నెల 13 న నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గల పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణం వద్ద నిర్వహించబడునన్నారు.ముదిరాజ్ లు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు ముత్యాల స్వామి,తుమ్మలపల్లి మహేందర్, మంద బిక్షపతి,ఈర్ల రమేష్,లక్క రమేష్ , బుస్సాని నారాయణ,బొల్లు రవి,పల్లె బాలకిషన్,ఓరంగంటి కుమారస్వామి,తుమ్మలపల్లి రాజు, గిన్నె మోహన్,గిన్నె కట్టస్వామితో పాటు అన్ని గ్రామాల మత్స్య శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.