
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
గాంధీ హాస్పిటల్ పై బురద జల్లి వైద్యం కోసం వచ్చే నిరుపేదల మనోస్థైర్యాన్ని కేటీఆర్ దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు ఆరోపించారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖాన్లను 10 సంవత్సరాల పాటు నాశనం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహాలో కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు. గాంధీని నాశనం చేసి కార్పొరేట్ హాస్పటల్ లకు లబ్ది చేకూర్చాలని ఆయన కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆ కుట్రలో భాగంగానే గాంధీ హాస్పిటల్ పై బురద చల్లుతున్నారన్నారని, కేటీఆర్ ఇకనైనా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేయడం మానుకోవాలని, లేనియెడల ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారన్నారు.