
MRPS Celebrates 31st Foundation Day
న్యామతాబాద్ లో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్ కల్ మండలంలోని న్యామతాబాద్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు cశుక్రవారం 31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ శ్రేణులు శరణప్ప, సంగమేష్ లో ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా శ్రేణులు రామ్ చందర్, అబ్రహం సంస్థ ఏర్పాటు, లక్ష్యం, విధివిధానాలపై యువతకు మార్గదర్శనం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ సేవలను గుర్తు చేస్తూ.. వారి మార్గంలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఉల్లాస్, నిర్మల్ కుమార్, శాంత కుమార్ నరసింహారెడ్డి గొల్ల షాంపూ, సుక్కప్ప, రూబెన్, రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.