
గొల్లపల్లి నేటి ధాత్రి:
గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగు సర్వీసులు పెంచాలనిమంగళవారం జగిత్యాల డిపో మేనేజర్ సునీత కువినతి పత్రం ఇచ్చిన ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి.
జగిత్యాల డిపో నుండి ఒకప్పుడు గొల్లపెళ్లి మండలంలోని వివిధ గ్రామాల మీదుగా ధర్మారం వరకు పల్లె వెలుగు సర్వేసులు నడిచేవని ఇప్పుడు అవి రావడం లేదని దీని వల్ల గ్రామాల్లోని నిరుపేద ప్రజలు మహిళలు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పల్లె వెలుగు బస్సులు రాక పోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు విద్యార్థులు ఉపయోగించుకోవడం లేకపోతున్నారని కావున జగిత్యాల డిపో మేనేజర్ స్పందించి గొల్లపెళ్లి మండలంలోని వివిధ గ్రామాలు తీర్మలాపూర్ నుండి రంగాధమునిపల్లి, లక్ష్మిపురం, ధమ్మన్నపేట, ఆత్మకూరు, గొల్లపల్లి మీదుగా ధర్మారం వరకు రోజుకు 4 ట్రీప్పులు పల్లె వెలుగు సర్వీసులను జగిత్యాల డిపో నుండి నడపాలని అందులో 2 త్రిప్పులు విద్యార్థుల కళాశాల సమయంలో పాఠశాలల సమయంలో నడిపితే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందనిఇట్టి విషయంపై త్వరగా చర్యలు తీసుకోవలని ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి డిపో మేనేజర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.