ఎండపల్లి జగిత్యాల నేటి దాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన క్రికెట్ యూత్ అసోసియేషన్ సభ్యులు టోర్నమెంట్ లో పాల్గొనడానికి టీ షర్టులు పంపిణీ చేయాలని గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం ను కోరగా వెంటనే స్పందించి గ్రామంలోని క్రికెట్ ఆటగాళ్లయిన యూత్ సభ్యులకు జెర్సీ టీషర్ట్ లను గురువారం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ క్రికెటర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులంతా ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు ఎలుక భగవాన్ యాదవ్, క్రికెటర్స్ టీం కెప్టెన్ గుమ్ముల వెంకటేష్, కోమటిపల్లి రాము, రాజేష్, మెడపట్ల రవితేజ, ఆరెల్లి ముఖేష్, పల్లికొండ కొమురయ్య, ఆరెల్లి విగ్నేష్, ఆరెల్లి అజయ్, జెట్టి మహేష్ లతోపాటు క్రికెట్ క్రీడాకారుల యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.