
Date 06/04/2024
—————————————-
కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది: ఎంపీ రవిచంద్ర
కాంగ్రెస్ పాలకులు రైతులు, ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోతున్నది: ఎంపీ రవిచంద్ర
ఎంపీ రవిచంద్ర ఖమ్మం జిల్లా కల్లూరు,వైరా రైతు భరోసా దీక్షలకు లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు
కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపు మేరకు ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు,వైరాలలో శనివారం “అన్నదాతకు అండగా రైతు భరోసా దీక్ష”లలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోతున్నదని విమర్శించారు.వ్యవసాయ పంపుసెట్లు, గృహ వినియోగదారులకు 24గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎంపీ వద్దిరాజు వివరించారు.అలాగే, సామాజిక పింఛన్లను రూ.4వేలకు పెంచుతామని హామీనిచ్చి అమలు చేయడం లేదన్నారు.పంట నష్టపోయిన రైతులకు రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని, క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని ఎంపీ వద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కల్లూరులో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో,వైరాలో మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలకు రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన రవిచంద్రను పలువురు ప్రముఖులు కలిసి శాలువాలతో సత్కరించి తమ శుభాకాంక్షలు తెలిపారు.