
Date 21/09/2024
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి,మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,కాలేరు వెంకటేష్,మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు
బాపూజీ 12వ వర్థంతి సందర్భంగా శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ ప్రముఖులు పూలదండలు వేసి, పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు. న్యాయవాదిగా, మంత్రిగా,పోరాటయోధుడిగా తెలంగాణ సమాజానికి,బడుగు బలహీన వర్గాలకు బాపూజీ చేసిన సేవల్ని ప్రస్తుతించారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్,రావుల చంద్రశేఖరరెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్,బాల్క సుమన్,బొల్లం మల్లయ్య యాదవ్,నోముల భగత్,బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్,జూలూరు గౌరీశంకర్,చిరుమళ్ల రాకేష్, గజ్జెల నగేష్,గెల్లు శ్రీనివాస్ యాదవ్,వాసుదేవ రెడ్డి,ఉపేంద్రాచారి,దూదిమెట్ల బాలరాజ్ యాదవ్,గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితర ప్రముఖులు బాపూజీ చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు