
బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు:ఎంపీ రవిచంద్ర
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నరు:ఎంపీ రవిచంద్ర
కేసీఆర్ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది:ఎంపీ రవిచంద్ర
ఇల్లందులో వచ్చే ఒకటిన జరిగే “ప్రజా ఆశీర్వాద సభ”నేపథ్యంలో ఎంపీ రవిచంద్ర మంత్రి సత్యవతితో కలిసి గార్ల మండలం మర్రిగూడెంలో విలేకరులతో మాట్లాడారు
బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మరోసారి అధికారంలోకి రావడం, మహానేత చంద్రశేఖర రావు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని,ఇతర పార్టీలు దరిదాపుల్లో కూడా లేవని ఆయన స్పష్టం చేశారు.బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ “ప్రజా ఆశీర్వాద సభ”లకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఎంపీ రవిచంద్ర వివరించారు.ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలం మర్రిగూడెంలో శనివారం మధ్యాహ్నం ఆయన మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఇల్లందులో వచ్చే నెల ఒకటవ తేదీన జరిగే బీఆర్ఎస్ సభకు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావల్సిందిగా గులాబీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మహబూబాబాద్ జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ అంగోతు బిందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, బీఆర్ఎస్ ప్రముఖులు బానోతు హరిసింగ్ నాయక్,శివాజీ,మూల మధుకర్ రెడ్డి, రంగనాథ్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.