భద్రాచలం నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్.
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మోడెం వంశీ అనే పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు యూరప్ ఖండంలోని మాల్టా దేశంలో ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 3 వరకు జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఇండియాకు బంగారు పతకం సాధించడం జరిగింది.వచ్చే నెల నాలుగవ తేదీ నుండి 13వ తేదీ వరకు సౌత్ ఆఫ్రికా సన్ సిటీలో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మోడెం వంశీ ఎంపిక అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో గెలుపొందిన మోడెం వంశీని, జిమ్ కోచ్ జివి రామిరెడ్డిని, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులను, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అభినందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తొందరలోనే మోడెం వంశీ ని కల్పించి, అతనిని ఆర్థికంగా ఆదుకునే విధంగా తన వంతు సహకారం అందిస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ జివి రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, కోశాధికారి మహంతి వెంకటకృష్ణాజి ( సీనియర్ నేషనల్ పవర్ విక్టర్) ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ మోడెం వంశీ తదితరులు పాల్గొన్నారు