జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన వనపర్తి ఈశ్వరయ్య దశదిన కర్మ కోసం 5 వేల రూపాయలు, మచ్చర్ల సీతమ్మ-మల్లయ్య కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని గురువారం ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ బూసవెన మల్లయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ ఎగ్గటి జగన్, బూర్గుల ఐలయ్య, మచ్చర్ల చంద్రయ్య, కిరణ్, రెనుకుంట్ల పూర్ణ శ్యామ్ సుందర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.