జైపూర్,నేటి ధాత్రి :
తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయాన్ని అందుకున్న శుభ తరుణాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి,పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలుసుకోని శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు. తమ వెన్నంటే ఉండి ఎంతో సహాయ సహకారాలు అందించి ప్రోత్సాహాన్ని అందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే చిన్న వయసులోనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయాన్ని సాధించి ఎంపిగా పదవి బాధ్యతలు స్వీకరించిన గడ్డం వంశీకృష్ణని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో కూడా అంచలంచెలుగా ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన సతీమణి విశాఖ ఇండస్ట్రీస్ ఎండి సరోజా వివేక్ మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.