
పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఎండీ సాహెబ్ హుస్సేన్
మండల కాంగ్రెస్ అధ్యక్షులు
వీణవంక,( కరీంనగర్ జిల్లా):
నేటి దాత్రి:నిన్న ప్రజాహితయాత్రలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాత్యులు పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను వీణవంక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ…
పార్లమెంట్లో ఎన్నడైన బీసీల గురించి మాట్లాడిన ముఖమేనా నిది
రెచ్చగొట్టే మాటలు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోని రాజకీయ అవగాహన లేని మూర్ఖునివి నువ్వా పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడేది…
నువ్వు నీ తల్లికి పుట్టుంటే ఇంకొకరి తల్లి గురించి ఇలా మాట్లాడవు
అసెంబ్లీలో బీసీ కుల గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టేలా కృషి చేసిన గౌరవ బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పేరు తీసే అర్హత లేని బీసీ వ్యతిరేకివి నువ్వు
హిందువుల మనోభావాలను నీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ మతం ముసుగులో దేవుడే నిన్ను అసహ్యించుకునేలా ప్రవర్తించే నువ్వు దైవంశ సంభూతుడు అయోధ్యను సుభిక్షంగా పరిపాలించిన రాముని పేరు తీసి అపవిత్రం చేయొద్దు.
హిందూ ధర్మం స్త్రీని గౌరవించడం నేర్పుతుంది అమ్మను ఆరాధించటం నేర్పుతుంది నీలాగా సభ్య సమాజం తలదించుకునేలా స్త్రీల పట్ల అ గౌరవంగా మాట్లాడడం విజ్ఞత లేని నీ పిచ్చి మాటలకు నిదర్శనం
అసలు నీకు రాజకీయ అవగాహన లేదు. నీలాంటి వాళ్లు ఎప్పుడు ఎలా మాట్లాడుతారు తెలియక జనం కొన్నిసార్లు నవ్వుకుంటున్నారు మరికొన్నిసార్లు అసహ్యించుకుంటున్నారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రతి మహిళ, తల్లిని గౌరవించే ప్రతి ఒక్కరూ,నిన్ను ఓడించి తీరుతారు.
.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, మాజీ అధ్యక్షులు గంగాడి రాజీ రెడ్డి, నల్ల కొండల్ రెడ్డి, నాయకులు జున్నుతుల మధుకర్ రెడ్డీ, ఈదునూరి పైడి కుమార్, అడిగొప్పుల సంపత్, చొక్కా రావు, నల్ల కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంబాల రంగయ్య,, సార్ల మధునయ్య, జున్నుతుల రాజిరెడ్డి, సంధి సురేందర్ రెడ్డి, మదాసు సునీల్,పానుగంటి మధుకర్, ఒద్దపల్లి కొమురయ్య,ఎండీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.