కొత్తగూడ,నేటిధాత్రి:
మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పొరికా బలరాం నాయక్ జన్మ దిన వేడుకలు కొత్తగూడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ములుగు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు షేక్ సల్మాన్ పాషా అధ్యర్యం నిర్వహించిన ఈ జన్మ దిన వేడుకలకు ఎంపీ బలరాం నాయక్ 60వ పుట్టిన సంవత్సరాన్ని పురస్కరించుకుని 60కేజీల భారీ కేక్ ను స్థానిక కార్యకర్తల నడుమ కోయడం జరిగింది. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ మంత్రి సీతక్క ,మరియు ఎంపీ బలరాం నాయక్ లా సారథ్యం లో కొత్తగుడ ,గంగారం మండల లో అభివృద్ధి సాధ్యపడుతుందని,గిరిజన ,మారుమూల ప్రాంతాల అభివృద్ధి ,మౌలిక సదుపాయాలు కల్పించబడు తాయని, ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజం సారంగం,జిల్లా ఏస్టి సెల్ నాయకులు బోడ ఈరియా, కొత్తగూడ టు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సిద్ధబోయిన రాధా బిక్షం, కొత్తగూడ టౌన్ ప్రెసిడెంట్ గుమ్మడి సమ్మయ్య, కొత్తగూడ ఎంపీటీసీ హలావత్ సాలుకి సురేష్, కొత్తగూడ 2 ఎంపిటిసి బుర్క పుష్పలత నరేందర్, బుర్కా యాదగిరి, వెల్దండి వేణు, కట్రోజ్ బిక్షపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, చొప్పరి కుమార్, బొల్లం ఐలయ్య,ఎస్సి సెల్ మండల నాయకులు సిరిగిరి సురేష్ , గూగులోత్ సాంబయ్య, ఇమ్రాన్,సొలం వెంకన్న,అజ్మత్,ప్రవీణ్,భూక్యా సురేష్,సందీప్,తదితరులు పాల్గొన్నారు.