ఎంపి అభ్యర్థికి బహిరంగ లేఖ
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఖర్చుల డబ్బులను ఇవ్వాలని కోరుతూ బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షుడు కందగట్ల టాక రాజు ఎంపీ అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌కు వాట్సాప్ గ్రూప్ ద్వారా బహిరంగ లేఖను రాసారు .ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో మహిళలతో రోడ్‌షోను నిర్వహించారని తెలిపారు .కోలాటం మహిళలకు ఒక్కరికి వంద రూపాయల చొప్పున 550 మందికి 55000 అలాగే మంచినీటి ప్యాకెట్ల కోసం 800రూపాయలు ఖర్చు అయ్యాయని ,అందుకు పార్లమెంటు అభ్యర్థి హుస్సేన్ నాయక్ , నర్సంపేట ఎన్నికల ఇంచార్జి బోడా వీరన్న ముప్పైనాలుగు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగతా 26300 రూపాయలను ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ రాజు ఆరోపించారు.
వీరన్నను ఎన్నికల ఖర్చుల మిగతా డబ్బులు ఇవ్వమని అడిగితే గతంలోనే ఇచ్చారంటూ దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని ఈ విషయంపై అభ్యర్థి హుస్సేన్ నాయక్ కు వివరించి తెలుపగా గతంలోనే మొత్తం డబ్బులను వీరన్నకు ఇచ్చామని తెలిపినట్లు ఆయన తెలిపారు. కోలాటం సంబంధించిన మహిళలు ప్రతిరోజూ తమ ఇంటి వద్దకు వచ్చి అడుగుతున్నారని, దీంతో దిక్కులేని స్థితిలో మనస్తాపానికి గురైతున్నట్లు రాజు వివరించారు. వెంటనే డబ్బులను జిల్లా పార్టీ అధిస్థానం ఇప్పించాలని కందగట్ల రాజు కోరారు.