ఎస్సై తిరుపాజీ.
బాలానగర్ / నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాల ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీటు బెల్టు ధరించాలని ఎస్సై తిరుపాజీ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడంతో రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా.. బాలానగర్ మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు