అమ్మ మాట అంగన్వాడీ బాట
గర్భిణీలు బాలింతలకు పోషకాహార లోపం అవగాహన సదస్సు
మరిపెడ నేటిధాత్రి
చిన్నారుల ఎదుగుదల, గర్భిణి,బాలింతల మహిళల ఆరోగ్యానికి అంగన్వాడి కేంద్రాలు భరోసగా నిలుస్తాయని, పిల్లలు గర్భిణీలు బాలింతలు అంగన్వాడి సెంటర్ ను కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూపర్వైజర్ గొల్లపల్లి రాణి అన్నారు. మండలంలోని రాంపురం గ్రామంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు, అంగన్వాడీ ముద్దు ప్రవైట్ స్కూల్ వద్దు అని నినాదాలతో తల్లిదండ్రులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 సంవత్సరాలు నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని, అంగన్వాడీ సెంటర్ పిల్లలు మానసిక శారీరకంగా అభివృద్ధి జరగటానికి అట పాటలతో పాటు విద్య ను బోధిస్తారన్నారు.గ్రామంలో గర్భిణీలు,బాలింతలు,పిల్లలు అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని గర్భిణీలు బాలింతలకు తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ యం.యశోద, జి.లలిత ఆయా నాగమ్మ, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.