టీఆర్ఎస్ పార్టీలోకి మోహిత్, చందు
కవిత సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న నర్సంపేట నేతలు
నర్సంపేట, నేటిధాత్రి:
తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, పంజాల శ్రీరామ్ సమక్షంలో నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ఎండి మోహిత్, శనిగరపు రాజు, హన్మకొండ చందు ఆ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కవిత పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. భవిష్యత్తులో పార్టీ నిబంధనలకు లోబడి పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని కొత్తగా చేరిన నేతలు తెలిపారు.ఈ చేరికకు సహకరించిన రాష్ట్ర కార్యదర్శి నవీన చారి, తడిగొప్పుల మల్లేశంలతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
