
21 వ వార్డు కౌన్సిలర్ బీజేపీ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్ పి జయంత్ లాల్
పరకాలనేటిధాత్రి
దేశ ప్రధానిగా ముచ్చటగా మూడవ సారి గెలిపించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పరకాల మున్సిపల్ 21 వ వార్డు కౌన్సిలర్ అర్ పి జయంత్ లాల్ కోరారు. బుధవారం పరకాల పట్టణంలోని 21వ వార్డులో బీజేపి నాయకులలో కలసి ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులకు సంబందించిన కర పత్రాలను ప్రజలకు అందించి బీజేపీ కి ఓటు వేసి ఎంపీగా అరూరి రమేష్ ను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా జయంత్ లాల్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, బీఆర్ఎస్ పనైపోయిందన్నారు. ప్రధాని మోదీ పాలనలో అయోధ్య నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు.మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచారన్నారు.మోదీ సర్కార్ 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చిందని,ప్రపంచ దేశాలు మోదీ వైపు చూస్తున్నాయని వివరించారు.దేశంలో అభివృద్ధి,సంక్షేమంతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను మోదీ పరిష్కరిస్తూ జాతి గౌరవాన్ని పెంచుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చా పట్టణ అధ్యక్షురాలు వెనిశెట్టి శారద, పోలింగ్ బూత్ అధ్యక్షులు మరాఠీ నర్సింగ రావు,శికరి జితేందర్,సూదమల్ల సాయి కుమార్,వాసు,పాండు తదితరులు పాల్గొన్నారు.