ఢిల్లీలో మోడీ.. భువనగిరిలో ‘బూర’

https://epaper.netidhatri.com/view/257/netidhathri-e-paper-8th-may-2024%09/3

– ఇదే భువనగిరి ప్రజలు కోరుకుంటున్నరు..

– బూర నర్సయ్య గౌడ్​అట్టడువర్గాల గొంతుక

– ఉమ్మడి జిల్లాలోనే రికార్డు మెజారిటీతో గెలుస్తా

– నవరత్నాలు, భువనగిరికి ఎయిమ్స్​ నా కృషి ఫలితమే

– రూ. 9 వేల తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత నర్సయ్యది..

– ‘చామల’కు ఓటేస్తే.. రాజగోపాల్ మంత్రి అవుతుడట!

– పేరు చెప్పుకొని ఓట్లడుగలేని దుస్థితి కాంగ్రెస్​అభ్యర్థిది

– ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​లో రెడ్లు తప్ప లీడర్లు లేరట!

– తండ్రులు రిటైర్​మెంట్​తో కొడుకులను దింపుతున్నరు

– విద్యార్థి ఉద్యమ నాయకుడు , బీసీ బిడ్డ కైలాశ్​అర్హత లేదా?

– క్లీన్​స్వీప్​భయంతోనే బీసీ రిజర్వేషన్ల రద్దు ప్రచారం..

– త్వరలో కాంగ్రెస్​పార్టీకి జాతీయ హోదా రద్దు ఖాయం

– ‘నేటి ధాత్రి’తో బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​

నేటి ధాత్రి, స్టేట్​బ్యూరో:

‘పార్టీ కంటే పర్సన్ ను చూడండి.. జెండా కంటే ఎజెండా చూడండి.. బూర నర్సయ్య గౌడ్​ఆర్భాటం కంటే అభివృద్ధి చూడండి.. ప్రధాని మోడీ దేశాన్ని పాలిస్తున్న తీరును చూడండి.. బూర నర్సయ్య గౌడ్​ను బీజేపీ నిబద్ధతను చూడండి. ప్రతిపక్షంలో ఎంపీగా ఉన్నప్పుడే .. రూ. 9 వేల కోట్లు తీసుకొచ్చిన ఘనత నాది’ అని అంటున్నారు బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. రాష్ట్ర అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమని ఆయన అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకొచ్చానని చెప్పారు. ఎంపీగా గెలుపొందితే భువనగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. తన ప్రత్యర్థులు ఇద్దరూ తనకు పోటీయే కారని, ఉమ్మడి జిల్లాలోనే రికార్డు మెజారిటీతో గెలిచి చూపుతానని సవాల్​విసురుతున్నారు. భువనగిరి కోటాపై కమలం జెండా ఎగరేస్తానని అంటున్న బూర నర్సయ్య గౌడ్‌తో ‘నేటి ధాత్రి’ ముఖా ముఖి..

ప్రచారం ఎట్లా కొనసాగుతుంది?

‘గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలనే నినాదం దేశవ్యాప్తంగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ‘ఢిల్లీలో మోడీ భువనగిరిలో ‘బూర’ ఉండాలని పార్లమెంట్​నియోజకవర్గంలో రాజకీయంగా అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి కోరుకుంటున్నారు. ఈ రెండు నినాదాలు చాలు.. భువనగిరిలో నేను గెలవడానికి’ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయం.

అధికార కాంగ్రెస్​నుంచి సీఎం రేవంత్​రెడ్డి అనుచరుడు బరిలో ఉన్నారుగా?

‘భువనగిరిలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దిగి బూర నర్సయ్యను ఓడించాలని ప్రచారం చేస్తున్నారంటేనే.. అది వారి ఓటమికి సంకేతం. రాజకీయాల్లో ఎవరూ హీరోలు ఉండరు. ప్రజలు ఓటేస్తేనే.. ఎవరైన హీరో.. లేకపోతే అంతా జీరోలే.. ఉమ్మడి నల్గొండ జిల్లాను కాంగ్రెస్​కంచుకోట అంటున్నారు.. కానీ గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క కాంగ్రెస్​ఎమ్మెల్యే కూడా లేరు కదా? 12 స్థానాల్లోనే టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలే గెలిచారు కదా? అంటే ప్రజల ఆకాంక్షకు తగినట్లుగా మారుతాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్​పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్​కు ఓటేశారు.. తప్పా.. కాంగ్రెస్​పార్టీని గెలిపించాలని కాదు. దీంతో వారు వాపును చూసి బలుపనుకుంటూ భ్రమ పడుతున్నారు. భువనగిరి ని బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పూలేభవన్ పై కాషాయం​జెండా ఎగరేస్తాం.

2018లో ఇదే కాంగ్రెస్​చేతిలో ఓడిపోయారు కదా?

‘నేను ఓడిపోలేదు. కోమటిరెడ్డి స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. నైతికంగా గెలుపు నాదే.. రోడ్డు రోలర్​గుర్తు ద్వారా ప్రజలు కన్​ఫ్యూజ్​అయ్యారు. గెలుపు ఓటములు సహజం. రేవంత్​రెడ్డి, వెంకట్​రెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన తర్వాతనే కదా ఎంపీలుగా గెలిచింది. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచి ముఖ్యమంత్రి, మంత్రి అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి మంత్రి పదవి రావడం.. తమ్ముడు రాజగోపాల్​రెడ్డి జీర్ణించుకోలేక పోవడం.. అన్న పదవిని ఎప్పుడు ఊడగొట్టాలనుకోవడం.. ఇవన్నీ మళ్లీ జరుగుతున్నాయి కదా.. కాంగ్రెస్​పార్టీ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమనడానికి.. నిదర్శనం ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులదే ఆధిపత్యం ఉంటే ప్రజలు జీర్ణించుకోలేరు. ఈ అభ్యర్థి గురించి స్థానిక కాంగ్రెస్​నేతలకే పెదవి విరుపు ఉంది. ఆయన ప్రజాసేవకుడు కాదు, సామాజిక సేవకుడు కాదు. అనేది ప్రజలే చెప్తున్నరు. కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థికి ఓటేస్తే రాజగోపాల్​రెడ్డి రాష్ట్రంలో హోం మంత్రి అవుతడంటా.. ఇంత విచిత్రమైన వాదన ఎక్కడైనా ఉంటదా? ‘‘నాకు ఓటేస్తే.. నేను నియోజకవర్గానికి ఇది చేస్తా అని చెప్తారు. నీకు దమ్మూ ధైర్యం నువ్వేం చేస్తావో చెప్పాలి. ఇప్పటికే జిల్లాలో ఉత్తమ్​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మంత్రి ఉన్నారు. మళ్లీ రాజగోపాల్​రెడ్డికి ఎలా ఇస్తారు? రాజగోపాల్​రెడ్డి ఈ లాజిక్​ ఎట్లా మిస్​అవుతుండో అర్థం కావడం లేదు. కాంగ్రెస్​నాయకులకు తెలివి ఉంటే.. వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, మందుల సామేల్​వీరిలో ఎవరినో ఒకరిని చేస్తామంటే ప్రజలు నమ్మేవారు. గాడిద గుడ్డు అని ఒక ప్రస్తావన తెచ్చారు. అసలు వీళ్ల తెలివి ఎక్కడుందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. గాడిద గుడ్డు పెట్టదనే మినిమం నాలెడ్జ్​కూడా వీరికి లేదు. నాకు ముఖ్యమంత్రి సన్నిహితుడు. అందుకే మీరే ఖర్చు పెట్టుకుని ఓట్లు వేయించాలి. లేకుంటే మీకు పదవులు రాకుండా చేస్తా అని బెదిరిస్తున్నారు. అసలే జిల్లాలోని నా బహుజన ఎమ్మెల్యేలు ఎంతో కష్టపడి ఎదిగి ఎమ్మెల్యేలైన వారు.. వాళ్లకు తెలియదా? రేవంత్​రెడ్డికి సానుభూతి కలిసొచ్చి మల్కాజ్​గిరి ఎంపీగా గెలవలేదా? అదే సానుభూతి, తెలివిగా వ్యవహరించి కాంగ్రెస్​పార్టీలో సీఎం కాలేదా? ఇటీవల వరకు మకుటం మారాజుగా వెలుగొందిన కేసీఆర్​ఈ రోజుకు ప్రతిపక్షంలో కూర్చొని ఇంటికి పరిమితం కాలేదా? బూర నర్సయ్య గౌడ్​ భారీ మెజారిటీతో గెలువ బోతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చరిత్ర సృష్టించబోతున్నారు.

– మీరు గతంలో చేసిన అభివృద్ధిని నమ్ముకుంటున్నరా? మోడీ చరిష్మానా?

‘ కామన్​గా ఏదైనా కంపెనీతో పాటు ప్రొడక్ట్​ బాగుంటేనే దానికి గుర్తింపు దక్కుతుంది. వినియోగదారులు గుర్తిస్తారు. కంపెనీ బీజేపీ బాగుంది. మోడీ బాగున్నారు.. ప్రొడక్ట్​బూర నర్సయ్య గౌడ్​బాగాలేకపోతే ప్రజలు ఆదరిస్తారా? 9 వేల కోట్లు నవరత్నాలు తీసుకొచ్చిన ఘనత బూర నర్సయ్య గౌడ్​ది. ఎయిమ్స్​, పాస్​పోర్ట్​కేంద్రం, కేంద్రీయ విద్యాలయాలు, ఎంఎంటీఎస్​, జాతీయ రహదారులకు నిధులు, మాతా శిశు హాస్పిటల్స్​, నర్సన బీమా కుటుంబానికి దీమా, దండు మల్కాపురం ఇండస్ట్రియల్​పార్క్​, ఫాక్స్​కాన్​ కంపెనీ, హ్యాండ్లూమ్​, పెంబర్తి, తాటి పరిశ్రమ, విశ్వకర్మ యోజన ఇలా ఎన్నో పథకాల అమలుకు కృషి చేసిన.

కాంగ్రెస్​లో బీసీ అభ్యర్థులు లేరంటారా?

‘నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ సీట్లున్నాయి. జానారెడ్డి కొడుకులకే ఎమ్మెల్యే.. ఎంపీ సీట్లు ఇవ్వాలా? నల్గొండ జిల్లాలో రెడ్లు లేరా? బీసీలు లేరా? ఇదే భువనగిరి సీటుకోసం విద్యార్థి ఉద్యమ నాయకుడు, బీసీ బిడ్డ పున్న కైలాశ్​నేత అర్హుడు కారా? ఆయన తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేస్తున్నారు. ఎందుకు కేటాయించలేదు.ఆయనకంటే చామలకు ఏం టాలెంట్​ఉంది. ఓయూ ఉద్యమ నాయకురాలు తెలంగాణ ప్రాణాలకు తెగించి కొట్లాడ లేదా? ఆమెకు ఎందుకు ఇవ్వలేదు. కాంగ్రెస్​లో అలాంటి ఆలోచనే లేదు. అందుకే అట్టడుగు వర్గాల నుంచి అగ్రకుల పేదల వరకు మోడీ అంటే దేవుడిలా చూస్తున్నారు.’

ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం.. ఉంది?

‘రాష్ట్రంలో 3 నుంచి 5 సీట్లు కాంగ్రెస్​పార్టీ గెలిపించే అవకాశం ఉంది. 10 సీట్లు బీజేపీకి వస్తాయి.. ప్రధాని మోడీ ప్రచారం తర్వాత ఇంకా రెండు సీట్లు కూడా పెరుగొచ్చు. నాతో పోటీ పడుతున్న కాంగ్రెస్​ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి మాట్లాడుతున్న భాష. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. బేసికల్​గా నేను సౌమ్యుడిని. కానీ నాలోని ఒక్క కోణం మాత్రమే తెలుసు బూర నర్సయ్య గౌడ్​ప్రతికూల పరిస్థితులు ఉగ్రనరసింహుడిలా ఎలా ఉంటానో కొందిరికే తెలుసు. అసలు కిరణ్​కుమార్​రెడ్డి ముఖం చూసి ఎవరైన గుర్తిస్తున్నారా? కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారంలో మా ముఖాలు చూసి ఓటెయ్యమని అడుగుతున్నప్పుడే అర్థం అవుతంది. అందుకే అదంతా ప్రజలు చూసుకుంటారు. నా లక్ష్యం అట్టడుగు వర్గాల అభివృద్ధి. ఏదైనా రిజల్ట్​ఉండనియ్​. మీదేందిరా బై కుటుంబ రాజకీయం. వేరే రెడ్లు లేరా.. బీసీలు లేరా? ఒకడికి బీసీ బిడ్డ, ఆలేరు ఎమ్మెల్యే సామంత రాజు, మరొకాయనకు వీరేశం.. వీళ్లు ఏ చిన్న పనిచేయాలన్నా.. నోటెడ్​అని రాయించుకొని రావాలి. సామేల్​కు స్వతంత్రం లేదు. నాకు ఎమ్మెల్యే ఎందుకు అర్థం కావడంలేదు. నేను కాంగ్రెస్​గాలిలో గెలిచిన. రాజగోపాల్​రెడ్డి 30 వేల మెజారిటీతో గెలిచారు. మరి 50 వేల మెజారిటీ వచ్చినోళ్లు పెద్దోళ్లా.. 30 వేలు వచ్చినోళ్లు గొప్పోళ్లా? వీళ్లు చెప్పినట్లు వాళ్లు వినాలి కదా? వీళ్లు తురుం కాళ్లుగా ఫీలవుతున్నారు.

రాముడితో పేరుతో రాజకీయం చేస్తున్నారన్న కామెంట్లు వస్తున్నాయి.. దీనిపై మీ స్పందన ఏంటీ?

‘మోడీ అంటే త్రీడీ.. త్రీడీ అంటే..​ దేశం, ధర్మం, డెవలప్​మెంట్​గతంలో కాంగ్రెస్​హయాంలో ఉగ్రవాదులు తలలు నరికి పార్సల్​పంపేటోళ్లు. ఇప్పుడు దేశంలో మోడీ ప్రధాని అయ్యాక.. ఉగ్రదాడుల్లో జరగలేదు. నోట్ల రద్దు ద్వారా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. మోడీ ప్రధాని అయ్యాక వేరే దేశాల వాళ్లు మన దేశం వైపు చూడాలంటే భయపడుతున్నారు. గతంలో భయంకరమైన హిందువునని చెప్పారు.. మాజీ సీఎం కేసీఆర్..అప్పుడు మీకు మత రాజకీయాలు గుర్తుకు రాలేదా..? అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన ఘనత మోడీది. మోడీ పైసలు, మోడీ గ్యాస్, మోడీ ఉచిత వ్యాక్సిన్ , మోడీ బీమా ఆర్థిక వ్యవస్థను దేశంలో 3వ ర్యాంకు తెచ్చిన ఘనత మోడీది.. 5700 కిలోమీటర్ల రహదారిని నిర్మించిన ఘనత మోడీది. కోమటిరెడ్డి ఆస్తి 2009 లో రూ. 19 కోట్లు మాత్రమే 2023లో రూ. 500 కోట్లు ఎలా వచ్చాయి.. రాజకీయ వ్యాపారంతోనే ఇంత సంపద ఎలా వచ్చింది.. పోలింగ్ లో నాలుగో నెంబర్ లో గుర్తు మనది ధర్మం నాలుగో పాదం మీద నడుస్తుంది ఇదే బూర నర్సయ్య గౌడ్ గుర్తు’ గెలిపించాలని కోరుకుంటున్నా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *