# బీజేపీ అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దు
# ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమికొట్టాలని బీజేపీ అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని ప్రభుత్వ సంస్థలను అమ్మే బీజేపీ కావాలా దేశ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలే ఆలోచన చేయాలని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.నర్సంపేట పట్టణానికి చెందిన మాజీ వార్డు సభ్యులు సీనియర్ నాయకుడు గండి గిరి తోపాటు 30 కుటుంబాలు గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఏడాదికి 100 రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం తీసుకచ్చిందని కానీ ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం కేవలం ఏడాదికి 42 రోజులె పని కల్పిస్తుందని మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి 100 రోజులు పని కల్పించడంతో పాటు గతంలో మాదిరిగానే పని ముట్లు అందిస్తూ ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు అందిస్తామని అన్నారు. మహిళలు, యువకులు, శ్రామికులు, రైతులతో పాటు ప్రతీ ఒక్కరికి సమన్యాయం అందించాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యం అని చెప్పారు. యువకుల బలిదానాలు చూసి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కానీ ఇచ్చిన తెలంగాణను కెసిఆర్ దుర్మార్గపు పాలనతో సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారని ఆరోపించారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ 10ఏళ్ల పాలనలో అవినీతి, ఆక్రమాలు చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశామని చెప్పారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కృషి చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టిపిపిసి సభ్యులు పెండెం రామానంద్, జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, మున్సిపల్ ప్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, 16 వ వార్డు అధ్యక్షులు బాణాల శ్రీనివాస్-ప్రసన్న, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొంకిస మదన్ కుమార్ గౌడ్, పంబి వంశీకృష్ణ, మాజీ వార్డు మెంబర్ పేరం బాబురావు, దండెం రతన్ కుమార్, కోయ్యడి సంపత్, మైదం రాకేష్, మేడం కుమార్, తదితరులు పాల్గొన్నారు.