నేటిదాత్రి:
బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం లో వీణవంక మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి ఘన్ముక్ల , కిష్టంపేట గ్రామాలలో బిఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సైనికులతోసమావేశంలో పాల్గొని పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…..
ఆపదలో ఉన్నప్పుడు అతి దగ్గరి దూరంలో నీను నా నివాసం ఉందని ప్రతి ఒక్కరి కి అందుబాటులో ఉండే వ్యక్తిని. నేను మీ గ్రామంలో ఒక వ్యక్తిగా మీతో మమేకమై ఉండడం జరుగుతుందని ఆలోచించాలని రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నీ నన్ను ఆశీర్వదించాలని ప్రజలను వేడుకున్నారు.వారికి భరోసా కల్పిస్తూ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో అందరం కష్టపడి పనిచేసి బి ఆర్ ఎస్ పార్టీ కారు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు .బ్రాహ్మణపల్లి లో ప్రజలు బొడ్రాయి పోచమ్మ గుడి తదితర పనులు చెయాలి అని కోరగా తన సొంత ఖర్చుతో బొడ్రాయి పూర్తి చేస్తానని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి కౌశిక్ రెడ్డి నీ అధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి,జడ్పీటీసీ మాడ వనమాల సాధవ రెడ్డి, గంగాడి తిరుపతి రెడ్డి, సర్పంచులు సునీత మల్లారెడ్డి, బండారి ముత్తయ్య,ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి,కలకొండ మధుకర్ రెడ్డి, గాజుల రాజయ్య , మండల కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు .