హైదరాబాద్, నేటిధాత్రి:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
13వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5న ఓట్లు లెక్కిస్కారు. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయింది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు.