Narsampet MLA Accused of Fake Road Works
ప్రజాధనాన్ని కాంటా వేస్తూ ఎమ్మెల్యే సిసిరోడ్ల వ్యాపారం
కాంట్రాక్టర్ అవతారంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నర్సంపేట ఎన్నికల ఇన్చార్జి నన్నపనేని నరేందర్
నేను తెచ్చిన నిధులతోనే నర్సంపేటలో రోడ్లు పోస్తున్నడు.
అభివృద్ధి జరిగేది బిఆర్ఎస్ తోనే..రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.
29 వ వార్డులో నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ను గెలిపిస్తే.. మరో కుర్చీవేస్తా..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
29 వ వార్డు బిఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి,నన్నపనేని నరేందర్
నర్సంపేట,నేటిధాత్రి:
మహిళల పథకాలతో వారిని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజలను మోసం చేస్తున్నదని. ఇదే క్రమంలో నర్సంపేట పట్టణంలో ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్టర్ అవతారంతో ప్రజాధనాన్ని కాంటావేస్తూ నకిలీ సిసి రోడ్ల వర్కులు చేస్తున్నారని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి నన్నపనేని నరేందర్ ఆరోపించారు.

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ఇంటింటీ ప్రచారం చేపట్టగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నర్సంపేట ఎన్నికల ఇన్చార్జి నన్నపనేని నరేందర్ పాల్గొని ప్రచార చేపట్టారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులుతోనే నేడు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్టర్ గా

అవతారంతో క్రషర్ మిల్లుతో సహా అన్ని సొంత వస్తువులతో నాణ్యత లేని రోడ్లను పోసి ధనాన్ని దోచుకుంటున్నాడని, ఇప్పటికిప్పుడే రోడ్లకు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, నెలకు 2500 మహిళా పథకంలాంటి మరెన్నో మహిళా పథకాల ఆశలతో ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఈ మోసం చేసిన ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేందుకు మహిళలకు ఇదే సదవకాశం అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయి గోసపడుతున్నాం..వడ్డించే వాళ్ళు మనవాళ్ళు ఉంటే అభివృద్ధి మనదే.. అని నరేందర్ వివరించారు.గతంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి ముందు..తర్వాత సుదర్శన్ రెడ్డి వచ్చాక నర్సంపేట అభివృద్ధిని పరిశీలన చేసుకోవాలని కోరారు.కరోనా సమయంలో ప్రజలను విడిచిపెట్టి పోయిన వ్యక్తి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..ప్రజల కోసం నిత్యం పనిచేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కోరారు. నర్సంపేట పట్టణం టిఆర్ఎస్ ప్రభుత్వంలోని అభివృద్ధి జరిగిందని.. ఇక నుండి అభివృద్ధి జరిగేది బిఆర్ఎస్ తోనే..రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం 42 కోట్ల రూపాయల నిధులు తెచ్చానని.. ఆ నిధులను రద్దుచేసి మరల అవే నిధుల కోసం జీవోలు మార్చి రూ.42 కోట్ల నిధులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శ్రీ మాత కన్స్ట్రక్షన్ పేరుతో కాంట్రాక్టర్ రూపంలో ఎన్నికల ముందు హడావుడిగా పనులు చేస్తున్నారు.ఈ నిధులు నావి కాదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.కేసీఆర్ ప్రభుత్వ హయంలో నర్సంపేట మెడికల్ కళాశాల నిర్మాణం చేస్తే ఇటీవల నర్సంపేటలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ నిధులు ఏమి ఇచ్చామని ఒక రాయి వేసి శంకుస్థాపన చేశారని ఎద్దేవ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాధవ రెడ్డికి రెండు సంవత్సరాలుగా ఎలాంటి సత్సంబంధాలు లేనప్పటికీ సీఎంకు.. ఎమ్మెల్యేకు నెల రోజుల్లోనే మాటలు కలిసి పనులు వెంటనే ఎలా ప్రారంభం. చేశారు. ఆ నిధులు ఎక్కడివి అని పెద్ద సుదర్శన్ రెడ్డి అడిగారు. పట్టణంలోని నిరుపేద ప్రజలకు శుభకార్యాల కోసం ఏసీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తే నేటికీ ప్రారంభం చేయలేదని ఆరోపించారు.మహిళా పథకాలతో కాంగ్రెస్ పార్టీకి తలొగ్గిన ప్రజలకు మోసం జరిగింది. నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ వార్డు కౌన్సిలర్ గా గెలిపించండి..మరో గౌరవ పదమైన మెట్టుపై నిల్చుపెడుతానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, వార్డు బాధ్యులు, పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు.
