మండల ప్రజలు ఆనందోత్సవాలు
శాయంపేట నేటిధాత్రి
శాయంపేట మండలానికి నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.ప్రజా పాలన ప్రజా విజయో త్సవాలల్లో భాగంగా అంబే డ్కర్ సెంటర్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయో త్సవసభ లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ విజయోత్సవ సభలో పెద్ద సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎమ్మెల్యే కు బోనాలు, ఒగ్గు డోల్లతో ఘనంగా స్వాగతం పలికి సభా స్థలానికి ర్యాలీగా వచ్చారు. అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడు తూభూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం గడిచిందని, ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. రూ.2 లక్షల పైకి రుణం ఉన్నవారికి త్వరలోనే మాఫీ అందజేస్తా మని తెలిపారు. నిజమైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కొరకు పైరవీలు చేసే వారిని నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, అన్ని గ్రామల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.