జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం రోజున చెన్నూర్ మండలం లోని బుద్దరం, సంకరం,కన్నేపల్లి,చింతల పల్లి,అక్కేపల్లి, శివలింగ పూర్, గ్రామాల ను సందర్శించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల ను అడిగి స్వయంగా తెలుసుకోవడం జరిగింది. ఆయా గ్రామాలలోని రోడ్ల పరిస్థితిని గమనించి నిర్మాణాలు అవసరమైన అంచనా వ్యయాన్ని, నాళిల నిర్మాణం వ్యయాన్ని గురించి అంచనా వివరాలు తెలియచేయండి అని రోడ్లు భవనల ఇంజనీర్ తివారీని ఆదేశించడం జరిగింది.గ్రామాలలో ఉన్న విద్యుత్ మరియు ఓల్టేజి సమస్యల గురించి విద్యుత్ శాఖ ఏడీ నుండి వివరాలు సేకరించి వెంటనే మరమ్మత్తులు అవసరమైన ప్రదేశంలో ఎక్కడైతే నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలో వెంటనే ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించడం జరిగింది. మంచినీటి సదుపాయాలను గురించి అడిగి తెలుసుకుని వాటర్ ట్యాంకుల మరమ్మతులను పైప్ లైన్లు మరమత్తులను సకాలంలో పూర్తి చేయాలని స్థానిక పంచాయతీ అధికారులకు పారిశుధ్యo పర్యావరణం,మౌలిక సదుపాయాలు శ్రద్ధతో పూర్తిచేసి గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు.స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చల్లారామిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ రాజమల్ల గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల బాప గౌడ్, చెన్నూరు టౌన్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ, కోటపల్లి మండల అధ్యక్షుడు మహేష్ తివారి,హేమంత్ రెడ్డి, పోగుల సతీష్, గజ్జల అంక గౌడ్, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, బాణేశ్, చెన్న వెంకటేష్, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.