ఇందారం ఎస్సీ కాలనీలో బైక్ పై పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎస్సీ కాలనీలో జైపూర్ మండల్ యూత్ అధ్యక్షుడు అసంపల్లి శ్రీకాంత్ తో బైకుపై కాలనీలో తిరుగుతూ పలు సమస్యలపై ఆరా తీశారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ మీకు ఏ సమస్యలు ఉన్నా మా దృష్టి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వర్షాకాలంలో శుభ్రత పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ అధ్యక్షుడు ఎండి. ఫయాజ్, యూత్ అధ్యక్షులు అసంపల్లి శ్రీకాంత్, సిహెచ్.లింగయ్య,సిహెచ్. వెంకన్న, అసంపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!