*గ్రామంలో జరంపై సర్వే
ఏఎన్ఎం రాజా రిబ్బిక*
చేర్యాల నేటిధాత్రి…
చేతులను పరిశుభ్రంగా తినేముందు చిన్న తర్వాత చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏఎన్ఎం రాజా రిబ్బిక అన్నారు. గురువారం పెదరాజపేట గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అనంతరం విద్యార్థులకు అవగాహన కల్పించారు. మనం తిన్న తర్వాత తినకముందు చేతులను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో అవగాహన కల్పించారు. మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. అనంతరం గ్రామంలో జ్వరం ఎంతమందికి వచ్చింది ప్రజల ఆరోగ్యం ఏ విధంగా ఉంది అని గ్రామంలో ఇల్లు తిరిగి జ్వరం సర్వే నిర్వహించి జ్వరం వచ్చిన వాళ్లకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.