రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన పైండ్ల గంగయ్య కుమారుడు ఫైండ్ల ఈశ్వర్ అనివార్య కారణాలు, ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులతో పాఠశాల విద్యను మధ్యలోనే మానివేయగా అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గోపాలరావుపేట గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలోని ఆల్పోర్స్ పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థి ఫైండ్ల ఈశ్వర్ ని పాఠశాలలోని పదవ తరగతిలో చేర్పించారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, ఆధునిక యుగంలో చదువు అనేది చాలా ముఖ్యమైనదని పేద ప్రజల జీవితాలను మార్చేది ఒక్క చదువు మాత్రమే అని విద్యార్థికి హితబోధ చేశారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, దేశరాజుపల్లి గ్రామసర్పంచ్ కోల రమేష్, కిసాన్ సెల్ అధ్యక్షులు పురం రాజేశం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.