
పరకాల నేటిధాత్రి
అయోధ్య రామాలయంలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి వారిచే వేదమంత్రోత్సవాల మధ్య ఘనంగా ఉత్సవాల నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాముడు ప్రతి ఒక్కరికి ఆదర్శమూర్తి అని తండ్రి మాటను జవదాటని తనయుడిగా,సోదరులను అభిమానించిన అన్నగా,భార్య దూరమైన నిరంతరం అమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడని అన్నారు.రాముని అడుగుజాడలలో నడిచే ప్రతి ఒక్కరు సమాజంలో ఆదర్శమూర్తులుగా గొప్ప పేరు తెచ్చుకుంటారని ఆయన అన్నారు.