కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలనీ అధికారులకు ఆదేశం…
బతుకమ్మ సమీయించిన వేల ఆడపడుచులకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ..
హనుమకొండ జిల్లా, నేటిధాత్రి :
హనుమకొండ 58వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి శ్యామాల దుర్గాదాస్ పార్క్ ను సందర్శించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, పార్క్ అన్యాక్రాంతానికి గురి అవుతుందని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఈ రోజు అధికారులతో కలిసి పరిశీలించారు. పార్క్ ఆవరణ మొత్తం కలియ తిరిగిన ఎమ్మెల్యే బతుకమ్మ పండుగ సమీపించిన వేళ ఆడపడుచులకు పార్క్ ప్రాంగణంలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని,రాత్రి సమయంలో బతుకమ్మ వేడుకలు జరుకుంటారు కాబట్టి లైటింగ్ అమర్చాలని కోరారు,పార్కులో అసాంఘిక కలాపాలు జరగకుండా వాచ్ మెన్ ఏర్పాటు చేయాలనీ,పోలీస్ వారు పెట్రోలింగ్ జరపాలని ఆదేశించారు.పార్క్ చుట్టూ సీసీ కెమెరాలు అమర్చాలానీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్,పున్నం చందర్, ఎస్సీ సెల్ మహిళా అధ్యక్షులు మేరీ, సీనియర్ నాయకులు తాళ్లపల్లి రవీందర్ (జెకే ),డిప్యూటీ కమిషనర్ రవీందర్, హార్టికల్చర్ అధికారి రమేష్, కాలనీ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.