
MLA Dr. Bhukya Murali Nayak
ఆకస్మికంగా హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ …
ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి… ఎమ్మెల్యే మురళి నాయక్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన,ఎస్సీ బాలుర హాస్టల్ ను మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టోర్ రూమ్, కిచెన్, త్రాగునీటిని, టాయిలెట్, తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, మాజీ పీసీసీ సభ్యులు దాస్రు నాయక్,బండారు దయాకర్, జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.