New Ration Shop Opened in Mandaripet
కొత్త రేషన్ దుకాణం ప్రారం భించిన ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి :
శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామానికి చెందిన బడుగు అశోక్ నూతన రేషన్ దుకాణంను ఎమ్మెల్యే గండ్ర సత్యనార యణరావు ప్రారంభించా రు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర సరుకు లను సమయానికి, పారద ర్శకంగా ప్రభుత్వంఅందిస్తుంది గ్రామస్థాయిలో రేషన్ దుకా ణాల ఏర్పాటు ద్వారా ప్రజల కు సులభంగా సరుకులుఅందే విధంగా చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు.ఈ కొత్త రేషన్ షాప్ ద్వారా మాందా రిపేట గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికా రులు కృషి చేయాలని సూచించారు.ప్రజలు కూడా రేషన్ సరుకులను సద్వి నియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ ,శాయంపేట మండలం ఎమ్మార్వో , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.
