కూకట్పల్లి, జూన్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జి.హెచ్.యం.సి. అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం
లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ
గత పది సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలతో కూ
కట్ పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అభివృ
ద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా అందరి సహకా
రంతో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను మరియు ట్రాఫిక్ సమస్యలను నిర్మూలించామన్నారు, ప్రభుత్వం మారిన
ఆరు నెలల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోగా
గత సంవత్సరంలో 65 కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీ మంచినీటి పైప్లైన్ లకు శంకుస్థాపనలు చేసి టెండర్లు
జరిగిన అలాంటి పనులను పక్కన పెడుతున్నారని జిహెచ్ఎంసి అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం
చేశారు, ప్రభుత్వాలు మారిన ప్రజలకు చేసే అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని, కూకట్ పల్లి నియోజకవర్గం లోని చెరువుల నందు గుర్రపు డెక్కలు తొలగించాలని, దోమల మందు పిచికారీ చేయాలి అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు తెలిపారు. అంతేకాకుండా అభివృద్ధి కొరకు ఎక్కడికి వెళ్లడానికైనా వెనకాడనని ముఖ్యమంత్రిని మల్కాజ్ గిరి పార్లమెంట్
ఎంపీ ఈటెల రాజేందర్ ని కలిసి పెండింగ్ లో ఉన్నకూ
కట్ పల్లి నియోజకవర్గ పనులు త్వరగా పూర్తిచేయా
లని తెలుపడానికి వెనుకాడనని తెలిపారు.ఈ కార్య
క్రమం లో కూకట్ పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు
ముద్దం నరసింగ్ యాదవ్, పండాల సతీష్ గౌడ్,
శిరిషా బాబురావు, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి
సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, మందాడి శ్రీనివాస్ రావు, కూకట్ పల్లి ని
యోజకవర్గ కో ఆర్డినేటర్ సతీష్ అరోరా, అల్లాపూర్
డివిజన్ అధ్యక్షలు లింగాల ఐలయ్య, శ్రీహరి, జి.హెచ్.యం.సి. డి.సి.లు రమేష్, ఎస్.సి. చెన్నా
రెడ్డి, వాటర్ వర్క్స్ జి.యం.ప్రభాకర్, ఇంజినీరింగ్
ఈ ఈ సత్యనారాయణ, సి.ఈ.ఏ.ఈ.లు, జి.హెచ్
.యం.సి. వివిధ భాగాల అధికారులు పాల్గున్నారు.
ఫోటో నెంబర్ 1 లో….