
మంచిర్యాల నేటిదాత్రి
శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను కలిసి మీకు అండగా ఉంటానని భరోసాను ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రావాల్సిన ఆర్ధిక సహకారం అందేలా కృషి చేస్తానన్నారు. కార్మిక శాఖ నుంచి మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు పరిహారంగా మంజూరు చేయిస్తానని ,ఘటనకు కారణమైన భవన యజమానుల నుండి కూడా నష్టపరిహారం ఇప్పిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఎలాంటి అవసరం పడిన తనను సంప్రదించాలని సూచించారు. అలాగే గోడ కూలిన ఘటనకు బాద్యులైన భవన నిర్మాణ యజమానులతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చర్చించారు. మృతుల కుటుంబాలకు నగదు పరిహారం చెల్లించాలని సూచించగా అందుకు వారు సమ్మతించారు.