MLA Launches Paddy ProcureMLA Launches Paddy Procurement Centerment Center
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో పౌర సరఫరాల సంస్థ,గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(ఐకెపి)ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.రైతులు దళారులను నమ్మి మొసపోవద్దని,కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు.
ఏ గ్రేడ్‌కు రూ.2389, కామన్ రకానికి రూ.2369ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాణి,ఎంపీడీవో రామకృష్ణ,రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్,మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్, ఏపిఎం నాగేశ్వరరావు, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,పర్నేం తిరుపతిరెడ్డి, చాడ తిరుపతిరెడ్డి,గోల్కొండ సదానందం,రామకృష్ణ పురం మాజీ సర్పంచ్ పెండ్లి రాజు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు పెండ్లి లింగారెడ్డి,రాయిడి జీవన్ రెడ్డి,ఐకేపీ సభ్యులు గోనె చైతన్య,పెండ్లి సునీత,పద్మ,యార రజిత, ఎరుకల సుక్కపాల,బిజెపి మండల అధ్యక్షులు ఎరుక దివాకర్,తదితరులు పాల్గొన్నారు.
