
gas agencies
భూపాలపల్లి లో ఇండియన్ గ్యాస్ ఏజన్సీఅదనపు ఎక్స్టెన్షన్ కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే.
భూపాలపల్లి నేటిధాత్రి
వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు మెరుగైన సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. భూపాలపల్లిలో సోమవారం అనంత పద్మనాభ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అదనపు ఎక్స్టెన్షన్ కౌంటర్ ను ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి లోని అనంత పద్మనాభ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కంకటరాజ వీరు గౌడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్కడి నుండి భూపాలపల్లి వినియోగదారుల కు గ్యాస్ సఫఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకు భూపాలపల్లిలో అదనపు కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనపు కౌంటర్ ద్వారా వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందే విధంగా ఉంటుందని, అదనపు కౌంటర్ ను ఏర్పాటు చేసిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రాజవీర్ గౌడ్ ను ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అప్పం కిషన్, కంకటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫొటోస్.