సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణం కారల్ మార్క్స్ కాలనీ లోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే జీఎస్సార్ అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. పూజారులు ఎమ్మెల్యేకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
