చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మనగర్ ప్రాథమిక పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం రోజున ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రతిభ పాటవాలను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. అనంతరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు
ఎన్.మనోహర్ రావు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి,తరగతి గదిల నిర్మాణము ,తరగతి గదుల మరమ్మత్తులు, విద్యార్థులకు మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యార్థులకు అంగన్వాడీ నిర్మాణం కొరకు పలు మౌలిక సదుపాయాల ను కల్పించాలని ఎమ్మెల్యే ని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, వెంటనే అదనపు తరగతి గదులు, అంగన్వాడీ నిర్మాణము, తరగతి గదులకు మరమ్మత్తులు, విద్యార్థులకు మరుగుదొడ్లు పలు అభివృద్ధి కార్యక్రమాలకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
ఎమ్మెల్యేవెంటనే స్పందించి పాఠశాల విద్యార్థుల పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధానోపాధ్యాయులు మనోహర్ రావు ,ఉపాధ్యాయ బృందం గట్టు మంజుల, అంగన్ వాడి టీచర్ల తో పాటు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మరియు సర్పంచ్ గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ కాంగ్రెస్ నాయకులు సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.