
MLA Gandra Satyanarayana Rao
రేగొండలో బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.370 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బస్టాండు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… రేగొండ మండల కేంద్రంలో నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యార్థం నూతన బస్టాండ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రేగొండ మండల కేంద్రం పరకాల, భూపాలపల్లి, ములుగు, చిట్యాల, టేకుమట్ల పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉందన్నారు. రేగొండ నుండి వివిధ ప్రాంతాలకు నిత్యం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారన్నారు. అదేవిధంగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ఇప్పటివరకు రూ.186 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా, ఆర్థిక శాఖ ఆర్టీసీకి రూ.6,210 కోట్లు చెల్లించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ఎన్ఎస్ఆర్ సంపత్ రావు ఇప్ప కాయల నరసయ్య పున్నం రవి ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు