భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీ, పోలీస్ స్టేషన్ రోడ్డు, ఎమ్మార్వో రోడ్డులో టీయూఎఫ్ఐడిసి నిధులతో ఫేజ్ 5 కింద సుమారు రూ.140 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పి సీఈఓ, జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపనలు చేశారు. రూ.30 లక్షలతో కారల్ మార్క్స్ కాలనీ లో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా, రూ. 50 లక్షలతో పోలీస్ స్టేషన్ రోడ్డులో రోడ్డుకిరువైపులా సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చివరగా, రూ.60 లక్షలతో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుండి ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డులో బీటీ రోడ్డు వైడనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ తో పాటు, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. సదరు గుత్తేదారు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ వెంక రాణి సిద్దు వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ రెడ్డి 24 వ వార్డు కౌన్సిలర్ శిల్ప అనిల్ దాట్ల శ్రీనివాసు కో ఆప్షన్ సభ్యుడు ఇర్ఫాన్ అశోక్ పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.