చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ సేవలు మరువ లేనివని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్అన్నారు.
గురువారంచండూరు మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ జయంతిని సిపిఎం చండూరు మండల కమిటీ ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరల పెత్తందారులకు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు.చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో చాకలి ఐలమ్మ జన్మించారు అని, పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో అయిలమ్మకు బాల్య వివాహం జరిగిందని ఆయన అన్నారు.వీరిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడం, వీరి కులవృత్తిగా చాకలి వృత్తిని నిర్వహించేవారని ఆయన అన్నారు.. 1940 నుండి 1944 కాలంలో విసునూర్ దేశ్ముఖ్ మరియు రజాకార్లకు వ్యతిరేకంగా ఎర్ర జెండా పట్టింది చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు.. అగ్రకులాల స్రీలు వారిని కూడా దొర అని పిలిపించుకునేవారి వారి సంస్కృతికి చరమగీతం పాడారు అయిలమ్మ అని, ఈభూమి నాది పండిన పంట నాదని, దొర ఎవ్వడు అని, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి దక్కించుకోగలర ని ఆయన అన్నారు. ఆనాడు చాకలి ఐలమ్మ విష్ణుర్ దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డిల గూండాలను కొంగు నడుముకు చుట్టి కొడవలి చేత బట్టి తరిమికొట్టారని ఆయన అన్నారు.జనగామ తాలూకా ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్ర మహాసభలను పెట్టి ఎర్రజెండా చేపట్టి దొరల ఆధిపత్యాన్ని ఊరూరాచాటి చెప్పారనిఆయన అన్నారు. తెలంగాణ తొలి దశ స్వాతంత్ర పోరాటంలో, భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అనివారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులుకట్ట లింగస్వామి,సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య,వెంకటేశం,సిపిఎం నాయకులుఈరటి వెంకన్న, హమాలి యూనియన్ నాయకులు కావలి వెంకన్న, పుల్కరం అంజయ్య, శేఖర్, జగన్, బొమ్మర గోని లింగస్వామి, కుమార్, పుల్కరం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!