వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి రూరల్ మండలం ఎస్.ఎం. కొత్తపల్లి గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చే వరి ధాన్యాన్ని తేమ శాతం (మాయిశ్చర్) వచ్చిన వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్ర ఇన్‌చార్జ్‌కు సూచించారు. అలాగే రైతులకు ఎలాంటి కోతలు లేకుండా అధికారులు పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని ఆదేశించారు.వానాకాలం ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులకు అవసరమైన పరదాలను ప్యాక్స్ ద్వారా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మేకల సంపత్ సహకార అధికారి, భూపాలపల్లి ప్యాక్స్ చైర్మన్, సీఈఓ, ముఖ్య నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
