గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి పలు అభివృద్ధి కార్యకరమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.
చెల్పూరు గ్రామంలో రూ.30లక్షలతో గ్రామ పంచాయతీ మొదటి అంతస్తు ప్రారంభించారు.
చెల్పూరు గ్రామంలో రూ.45లక్షలతో ఇంటి గ్రేటెడ్ మార్కెట్ .30 లక్షలతో పార్క్ ప్రారంభించారు రవి నగర్ పల్లి గ్రామంలో రూ.15లక్షలతో నూతన అంగన్వాడీ భవనాన్ని, రూ.20లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.అప్పయ్యపల్లి గ్రామంలో రూ.20లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.గణపురం మండల కేంద్రంలో రూ.35లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించారు,రూ.20లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లను శంకుస్థాపన చేశారు, రూ.9.90లక్షలతో వడ్డెర కమ్యూనిటి హాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.కర్కపల్లి గ్రామంలో రూ.20లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఆయా గ్రామాలలో దసరా కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సర్పంచ్ లు నడిపెల్లి మధుసూదన్ రావు,పొట్ల నగేష్,తాళ్లపెల్లి మంజుల భాస్కర్ రావు, ఐలోని శశిరేకరాంచంద్రారెడ్డి, నారగాని దేవేందర్ గౌడ్,ఎంపీటీసీ లు చెన్నూరి రమాదేవి మధుకర్, పొనగంటి సుదర్మమాలహల్ రావు, మంద అశోక్ రెడ్డి, మోటపోతుల శివశంకర్ గౌడ్, మండల అధికార ప్రతినిధి మోతె కరుణాకర్ రెడ్డి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.